
17 నుంచి ప్రతిష్టాపనోత్సవాలు
బాసర: బాసరలోని శ్రీలలితా చంద్రమౌళీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఈనెల 17 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. ఉత్సవాల ఆహ్వాన పత్రికను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా మంగళవారం బాసరలో ఆవిష్కరించారు. కుంభాభిషేక మహోత్సవాలకు జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. ఈ పండుగ సందర్భంగా ప్రత్యేక వేద పాఠశాలను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడానికి యత్నిస్తున్నట్లు తెలిపారు. అంకురార్పణ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని వెల్లడించారు.
ఆలయ అభివృద్ధికి కార్యక్రమాలు
భవిష్యత్ ఆలయ అభివృద్ధిలో భాగంగా 108 లింగాలు, 12 జ్యోతిర్ లింగాలు, 8 ఫీట్ల ఎత్తైన నంది విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారని తెలిపా రు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం మండల మాజీ అధ్యక్షుడు పెద్దకొండ్రు సుధాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సతీశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు ముత్యం సంతోష్, హరిప్రసాద్, చింత రాజు, కొమ్ము సుధాక్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.