
క్రీడల్లోనూ రాణించాలి
● డీఈవో భోజన్న
నిర్మల్ రూరల్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని డీఈవో భోజన్న అన్నారు. జిల్లా కేంద్రంలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ అండర్–14, 17 బాల బాలికలకు ఎంపిక పోటీలు మంగళవారం నిర్వహించారు. డీఈవో పోటీలను ప్రా రంభించారు. 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు టీష ర్టులు అందజేశారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జోనల్‌స్థాయి పోటీలకు ఎంపిక చేశా రు. కార్యక్రమంలో ఆర్గనైజర్ శ్రీనివాస్, పీఈటీలు అంబాజీ, రాముగౌడ్ పాల్గొన్నారు.
జోనల్‌స్థాయికి ఎంపికై న క్రీడాకారులు..
అండర్ 14 బాలికలు..
ఆరాధ్య, అద్విత, అన్వితశ్రీ(వాసవి పాఠశా ల), హర్షిత(శ్రీచైతన్య), లాస్య(నారాయణ భైంసా)
అండర్ 14 బాలురు..
అర్జున్, శివదీప్, అద్విత్(విజయ హైస్కూల్), జషిత్(శ్రీచైతన్య), లవ్‌కుమార్(నారాయణ భైంసా)
అండర్ 17 బాలికలు..
ప్రతిభ (విజయ హైస్కూల్), అక్షర, అవని పటేల్, సహస్ర(వాసవి), భక్తి(అల్ఫోర్స్)
అండర్ 17 బాలురు..
సోహాన్, ఇమాద్, సాయి సంస్కార్, సంపత్‌రెడ్డి (విన్నర్స్ హైస్కూల్), విగ్నేష్ (నారాయణ హైస్కూల్)