
ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
ఖానాపూర్: ఆశ వర్కర్ల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు టి.జయలక్ష్మి అన్నారు. మండలంలోని మస్కాపూర్‌లో యూనియన్ మూడో జిల్లా మహాసభ మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విజయలక్ష్మి హాజరై మాట్లాడారు. కేంద్రం ఆశ వర్కర్ల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కనీస వేతనం రూ.26 వేలతోపాటు అర్హతను బట్టి పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతకుముందు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం నుంచి సభా వేదిక వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండాను ఆవిష్కరించి కార్యక్రమం ప్రారంభించారు.