
ఇంట్లో చోరీ
జైనథ్: మండలంలోని దీపాయిగూ డ గ్రా మంలో దు ర్ల రాజలింగు ఇంట్లో గుర్తుతెలి యని వ్యక్తులు చోరీకి పాల్ప డ్డారు. సమీప బంధువులు చనిపోవడతో రాజ లింగు కుటుంబంతో కలిసి మూడురో జుల క్రితం ఊరికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని వ ్యక్తులు ఇంటికి ఉన్న కిటికీలోంచి లోపలికి చొరబడ్డారు. బీరువా తలుపులు పగులగొట్టి మూ డు తులాల బంగారం, 25 వేల నగదును ఎత్తుకెళ్లారు. శనివారం స్థానికులు గమనించారు. వెంటనే అందించిన సమాచారంతో ఎస్సై గౌతమ్ పవర్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్ బృందంతో తనిఖీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.