
క్రీడా సంబురం
గోలేటిలో ప్రారంభమైన సెపక్‌తక్రా రాష్ట్రస్థాయి పోటీలు తరలివచ్చిన క్రీడాకారులు పోటీలను ప్రారంభించిన జీఎం విజయభాస్కర్‌రెడ్డి
రెబ్బెన: క్రీడా సంబురం మొదలైంది. రెండు రోజు ల పాటు జరిగే 11వ రాష్ట్రస్థాయి జూనియర్స్, సబ్ జూనియర్స్ సెపక్‌తక్రా పోటీలకు మండలంలోని గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానం వేదికై ంది. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లా ల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు, కోచ్‌లు, క్రీడాఽభిమానులతో మైదానం కోలాహలంగా మారింది. శనివారం ముఖ్య అతిథిగా హాజరైన బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్‌రెడ్డి క్రీడా పతకాలను ఆవిష్కరించి క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆపై క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. సుమారు 200 మంది క్రీడాకారులు, 50 మంది కోచ్‌లు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలకు గోలేటి ప్రాంతం పుట్టినిల్లులాంటిదని అన్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఎంతో మంది అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పోటీల్లో రాణిస్తూ మంచి గుర్తింపు పొందారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలను గోలేటిలో నిర్వహించడం అభినందనీయమన్నారు. సెపక్‌తక్రా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాల్గొన్నారు.
సెపక్‌తక్రా అంటే ఇష్టం
నాకు సెపక్‌తక్రా అంటే ఎంతో ఇష్టం. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నా. 8వ తరగతి నుంచి ఆడటం నేర్చుకున్నా. ఆటపై ఉన్న ఇష్టంతో పోటీల్లో రాణిస్తున్నా. రాష్ట్రస్థాయి పోటీల్లో నాలుగు
బంగారు, ఒకసారి వెండి పతకం సాధించాను.
– పి.అభినవ్ రాణా, రంగారెడ్డి
ఫస్ట్‌ప్లేస్ సాధిస్తాం
సొంత జిల్లాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఫస్ట్‌ప్లేస్ సాధిస్తామనే నమ్మకం ఉంది. దానికి తగినట్లుగా ఆటతీరును ప్రదర్శిస్తాం. ఇప్పటి వరకు మూడు సార్లు స్టేట్ మీట్‌ను ఆడాను. త్వరలో గోవాలో జరగబోయే నేషనల్స్ పోటీల్లో పాల్గొనబోతున్నా.
– అభినయ రమ్యశ్రీ, ఆదిలాబాద్
ఆత్మవిశ్వాసంతో ఆడుతాం
జిల్లా జట్టు క్రీడాకారులు ఆత్మ విశ్వాసంతో పోటీల్లో దిగుతున్నాం. ఇప్పటి వరకు ఒకసారి నేషనల్స్, మూడుసార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఒకసారి మూడోస్థానంలో సాధించాను. ఈసారి బంగారు పతకం సాధిస్తాను.
– కె.రాంచరణ్, ఆదిలాబాద్

క్రీడా సంబురం

క్రీడా సంబురం

క్రీడా సంబురం

క్రీడా సంబురం