
రెవెన్యూ, అటవీ అధికారుల సర్వే
దస్తురాబాద్: మండలంలోని దేవునిగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లపై శనివారం అటవీ, రెవిన్యూ అధికారులు కలిసి ఉమ్మడి సర్వే చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ విశ్వంబర్ మాట్లాడుతూ దేవునిగూడెం గ్రా మంలో పైలట్ ప్రాజెక్టు కింద 102 ఇందిరమ్మ ఇళ్లు మంజురు కాగా, 46 నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. 34 ఇళ్లకు అటవీ శాఖ అధికారులు అభ్యంతరం తె లిపారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఉమ్మడి సర్వే నిర్వహించి జిల్లాస్థాయి అధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. సర్వేలో ఎఫ్‌ఎస్‌వో కింగ్ ఫిషర్, సర్వేయర్లు శ్రీనివాస్‌రావు, సంధ్య, జీపీవో నర్సయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.