
వలస కార్మికులకు అండగా..
నకిలీ ఏజెంట్ల మాయమాటలు నమ్మొద్దు. సక్రమమార్గం ద్వారానే విదేశీ ఉద్యోగాలకు వెళ్లాలి. గల్ఫ్ తదితర దేశాల్లో ఉద్యో గ అవకాశాలు కల్పిస్తూ, నకిలీ ఏజెంట్ల మోసాలకు అడ్డుకట్ట వేయడానికి టామ్‌కామ్ సంస్థ పనిచేస్తుంది. లైసెన్స్ పొందిన రిక్రూట్‌మెంట్ ఏజెంట్ల ద్వారానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వం నేరుగా పర్యవేక్షించే ఈ వ్యవస్థలో కార్మికులకు జీతం, వసతి, భద్రత, వైద్య సదుపాయాలు స్పష్టంగా నిర్ధారించబడతాయి. ఉపాధికోసం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు నకిలీ ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలి.
– నంగి దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నారై
సలహాకమిటీ సభ్యులు, గల్ఫ్ వ్యవహారాల సమన్వయకర్త