
● గ్రామీణ జీవితంలో కొత్త ఉత్సాహం ● బంధాల బలోపేతానికి ప్
ముధోల్ : పచ్చని పైర్లు.. పారేటి సెలయేళ్లు.. కోడి కూతలు.. కోడె ల్యాగెలు.. ఎగిలి వారంగనే అలుకు నీళ్లతో తలకుపోసుకునే నేల తల్లి.. తెల్లా తెల్లని పాల ధారల్లో తెల్లారె పల్లె.. ఇదే పల్లెటూరు. పొద్దు పొడవక ముందే నిద్దుర లేచే పల్లె జనం పొద్దెక్కే యాలకు ఎవరి పనులకు వారు వెళ్లిపోతారు. సీ్త్ర పురుష భేదం లేకుండా రైతులు, రైతు కూలీలు పొలం బాట పడతారు. పొద్దంతా చేను చెల్కల్లోనే గడుపుతారు. ఇది గ్రామీణ జీవనంలో నిత్యకృత్యం. పంటలనే కంటిపాపలుగా చూసుకునే గ్రామీణులు.. ఉత్సవాలు వేడుకల్లో పాల్గొనడం చాలా తక్కువ. అందరూ కలిసి చేసుకునే పండుగలు అరుదు. అయితే పల్లెలు అంటేనే అనుబంధాలు, ఆత్మీయతలు గుర్తొస్తాయి. కానీ టీవీలు, సెల్‌ఫోన్‌లు వీటిని దూరం చేస్తున్నాయి. పొద్దంతా పొలం పనులు.. సాయంత్రం టీవీలు, సెల్‌ఫోన్లతో కాలక్షేపం కామన్ అయింది. ఈ నేపథ్యంలో పాత పల్లె సంస్కృతిని గుర్తు చేసేలా కొత్త తరం సరికొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టింది. ఆత్మీయతలు పెంచేలా.. బంధాలు బలోపేతం అయ్యేలా విభేదాలు తొలగిపోయేలా వేడుకలు నిర్వహిస్తున్నారు. మహిళలు ‘గాజుల పండుగ’, పురుషులు ‘కండువా పండుగ’ జరుపుకుంటూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇటీవల జిల్లాలో ఈ సంస్కృతి బాగా పెరిగింది. రైతు కుటుంబాలు చేసుకుంటున్న ఈ పండుగలు కొత్త సంస్కృతికి దారితీస్తున్నాయి. యువ రైతులు కుటుంబాలతో కలిసి ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ముధోల్‌లో గాజుల పండుగలో పాల్గొన్న మహిళలు

● గ్రామీణ జీవితంలో కొత్త ఉత్సాహం ● బంధాల బలోపేతానికి ప్

● గ్రామీణ జీవితంలో కొత్త ఉత్సాహం ● బంధాల బలోపేతానికి ప్