
గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ఖానాపూర్: మండలంలోని మస్కాపూర్ కేజీబీవీలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కేజీబీవీ ప్రత్యేక అధికారి సునీతరాణి కోరారు. తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న తెలుగు, ఫిజిక్స్, జువాలజీ, పీజీ సీఆర్టీ పోస్టులకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కేజీబీవీలో సంప్రదించాలని సూచించారు.
ఎంజేపీ డిగ్రీ కళాశాలలో..
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే పురుషుల డిగ్రీ కళాశాలలో స్టాటిస్టిక్స్ విభాగంలో అతిథి అధ్యాపకుని కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ విజయ్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 13న కాలేజీలో జరిగే డెమోకి నేరుగా హాజరు కావాలని సూచించారు. పీజీ పూర్తిచేసి, సెట్ లేదా నెట్ పీహెచ్‌డీ, ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. వివరాల కోసం 9505520097 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
డీసీసీ పదవికి దరఖాస్తు
కడెం: జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్ష పదవికి మండలంలోని కొండుకూర్ గ్రామానికి చెందిన పొద్దుటూరి సతీశ్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో దరఖాస్తును సమర్పించారు. పదేళ్లుగా పార్టీలో క్రియాశీలక నాయకుడిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఖానాపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన తనకు డీసీసీ అధ్యక్షుడిగా ఆవకాశం ఇవ్వాలని కోరారు. ఆయన వెంట ఏఎంసీ డైరెక్టర్ యాదగిరి ఉన్నారు.
డీసీసీ బరిలో ఉన్నా..
నర్సాపూర్(జి): మండలంలోని గొల్లమాడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సమత సుదర్శన్ తాను కూడా డీసీసీ అధ్యక్ష బరిలో ఉన్నానని పేర్కొన్నారు. పార్టీ పెద్దలు తను కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి అధ్యక్షుడిగా నియమించాలని కోరారు.