
డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. నృత్యాలు చేశారు. దీంతో కళాశాల ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా విద్యార్థినిలకు బతుకమ్మ, దసరా పండగల విశిష్టతను అధ్యాపకులు తెలియజేశారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ గంగాధర్, కోఆర్డినేటర్ అర్చన, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఇన్‌చార్జి రజిత, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.