
ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలి
భైంసాటౌన్: కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు అలింకో ద్వారా అందిస్తున్న ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ అన్నారు. పట్టణంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. 321 మంది దివ్యాంగులకు 477 ఉపకరణాలు అందించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, మున్సిపల్ కమిషనర్ బి.రాజేశ్‌కుమార్, పీడబ్ల్యూడీ ఎఫ్‌ఆర్‌ఓ మధుసూదన్, డీసీపీవో దేవిమురళి, ఐసీడీఎస్ సీడీపీవో రాజశ్రీ, సూపర్‌వైజర్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.