
● ఆదిలాబాద్‌లో ప్రత్యేకం ● గద్దెలు కట్టి.. పూలతో పూజిస్
బొడ్డెమ్మ గుంత (ఫైల్)
గద్దెలు కట్టి.. వెంపలి పెట్టి
జిల్లాలో మహాలయ అమావాస్య రోజు మహిళలు నిర్ణయించుకున్న ఒక స్థలంలో గుంతను తవ్వుతారు. అందులోని మట్టిని తీసి చుట్టూ 16 నుంచి 21 గద్దెలు ఏర్పాటు చేస్తారు. అనంతరం ఆడపడుచులు మంగళ హారతులతో వెళ్లి స్థానికంగా ఉండే వెంపలి చెట్టుకు పూజలు చేసి దానిని తీసుకొని వచ్చి గుంత మధ్యలో ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రతి ఇంటి నుంచి ఓ పళ్లెంలో పూలను బతుకమ్మగా చేసి తీసుకువస్తారు. వాటిని గద్దెల వద్ద ఉంచుతారు. గునుగు, గుమ్మడి, తంగేడు, బంతి తదితర పూలతో తీర్చిదిద్దుతారు. అటుకులు, పేలాలు, పల్లీలు, పుట్నాలు, బెల్లం, చక్కెర వంటి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం బతుకమ్మ పాటలతో లయబద్ధంగా నర్తిస్తూ, తమ కష్ట సుఖాలను తెలుపుకుంటారు. అనంతరం ఆ పూలను ఆ గుంతలోనే వేసి, అర్ధరాత్రి వరకు ఆడి పాడుతారు.