
రైతు ఉత్పత్తిదారుల సభ్యత్వ నమోదు
సోన్: మండలంలోని సిద్దులకుంట గ్రామంలో ఏపీ మాస్ సిరి రైతు ఉత్పత్తిదారుల సంస్థలో సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఏపీ మాస్ సభ్యులు మాట్లాడుతూ మహిళలు వ్యవసాయంలో ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. దళారులతో మోసపోకుండా పంటను సంస్థ ద్వారా అమ్మి వచ్చిన కమీషన్‌లో వాటాదారులుగా ఉండాలని కోరారు. మార్కెట్ కన్నా తక్కువ ధరకు విత్తనాలు ఎరువులు, మందులు వ్యవసాయ అవసరాలు సంస్థ ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు. సంస్థలో మూలధన వాటాకు సమానమైన ఈక్విటీ గ్రాంట్‌ను నాబార్డ్ ద్వారా పొందవచ్చని పేర్కొన్నా రు. భవిష్యత్తులో సంస్థ ద్వారా అనేక రైతులకు లబ్ధి చేకూరే ప్రయోజనాలు పొందాలంటే సభ్యత్వం తీసుకోవాలని కోరారు. సంస్థలో 70 శాతం మహిళలకు, 30 శాతం పురుషులు ఉన్నారని తెలిపారు. సంస్థ బోర్డు డైరెక్టర్లుగా ప్రతీ గ్రామం నుంచి ఒక మహిళకు అవకాశం ఉంటుందన్నారు. అధిక సంఖ్యలో సభ్యత్వం జరిగితే సోన్‌లో సంస్థ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని సీఈవో ప్రేమలత, కోఆర్డినేటర్ పద్మ తెలిపారు. మాదాపూర్ క్లస్టర్ ఏఈవో అశోక్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.