
అలరించిన జిల్లాస్థాయి టీఎల్‌ఎం మేళా
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వర గార్డెన్‌లో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి ఎఫ్‌ఎల్‌ఎన్‌టీఎల్‌ఎం మేళా అలరించింది. జిల్లాలోని అన్ని మండలాల నుంచి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు టీఎల్‌ఎంలను తయారుచేసి ప్రదర్శించారు. వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి, డీఈవో భోజన్న టీఎల్‌ఎంలను పరిశీలించారు. విద్యార్థులకు ఎలా వివరిస్తారో అడిగి తెలుసుకున్నారు. జిల్లాస్థాయి మేళాకు 190 టీఎల్‌ఎంలు రాగా, ఎనిమిదింటిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు.
రాష్ట్రస్థాయికి ఎంపికై న ప్రదర్శనలు..
ఆర్.రమేశ్‌బాబు ఎంపీపీఎస్ కడ్తాల్, మోబిన్ అహ్మద్ ఎంపీపీఎస్ ఓవైసీ నగర్, బి.శ్వేత ఎంపీపీఎస్ పీచర, ఏ.ప్రవళిక ఎంపీపీఎస్ నిగువ, ఎం.ఎల్లన్న ఎంపీపీఎస్ వానల్పాడ్, పి.వెంకటరాజం ఎంపీపీఎస్ పెర్కపల్లి, కావ్య ఎంపీపీఎస్ లింగాపూర్, మెహరీన్ నిషా, ఎంపీపీఎస్ నవాబుపేట్ ఎంపికయ్యారు.
తండ్రీకూతురు ప్రదర్శన..
జిల్లాస్థాయి టీఎల్‌ఎం మేళాలో తండ్రి, కూతురు పోటీపడ్డారు. కర్తాల్ యూపీఎస్ ప్రధానోపాధ్యాయుడు రమేశ్‌బాబు, ఆలూరు పాఠశాల ఎస్జీటీ సౌమ్య ఇద్దరూ తండ్రి కూతురు. టీఎల్‌ఎం మేళాలో ఇద్దరూ పాల్గొన్నారు. రమేశ్‌బాబు తెలుగు సబ్జెక్టులో, సౌమ్య ఇంగ్లిష్ సబ్జెక్టు బోధనోపకరణాలు తయారు చేశారు. ఇద్దరూ పక్క పక్కనే ఉండి తమ ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. ఇద్దరినీ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి, డీఈవో భోజన్న ప్రశంసించారు. రమేశ్‌బాబు ఎగ్జిబిట్ రాష్ట్ర ప్రదర్శనకు ఎంపికై ంది.