
గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యం అందించాలి
నిర్మల్ రూరల్: గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ మాతాశిశు ఆస్పత్రిని మంగళవారం తనిఖీ చేశా రు. ఆస్పత్రి ఆవరణలోని మహిళా శక్తి క్యాంటీన్ పరిశీలించి భోజనం నాణ్యత, పరిశుభ్రత వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ల్యాబొరేటరీ, స్కానింగ్ కేంద్రం, ఇన్ వార్డు, అవుట్ వార్డు, ఆపరేషన్ థియేటర్, ఓపీ, బాలింతల వార్డులను పరి శీలించి రోగుల పరిస్థితి, అందిస్తున్న వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. ప్రసవాల సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చూసుకోవాలని వైద్యులకు సూచించారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆస్పత్రి ప్రాంగణంలో శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతీరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నా రు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా ప్రధాన ఆస్పత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, ఆస్పత్రి పర్యవేక్షకులు సరోజ, వైద్యులు ఉన్నారు.