
వసతులు లేని ఎంసీహెచ్
నిర్మల్ మాతా శిశు ఆస్పత్రిలో సరైన వసతులు లేకపోవడం వల్ల గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిపడా పడకలు లేకపోవంతో అధికారులు వరండాలో అదనపు మంచాలు వేయించి వైద్యం చేస్తున్నారు. మంగళవారం ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్ అభిలాష అభినవ్ లోపాలను గుర్తించి అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణులు, బాలింతలు కూర్చోవడానికి కూడా స్థలం లేక ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఆస్పత్రిలోని కొన్ని గదుల్లో సీలింగ్ ఊడిపోయింది. విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. రెండు గంటలపాటు ప్రతీ విభాగాన్ని పరిశీలించిన కలెక్టర్ వసతుల కొరత, నిర్వహణలో అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల వివరణ కోరారు. లోపాలను తక్షణం సరిచేయాలని ఆదేశించారు – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్

వసతులు లేని ఎంసీహెచ్

వసతులు లేని ఎంసీహెచ్