శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి

Sep 12 2025 6:33 AM | Updated on Sep 12 2025 6:33 AM

శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి

శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి

నిర్మల్‌ రూరల్‌: విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని డీఈవో భోజన్న సూచించారు. గురువారం డీఈవో కార్యాలయంలో విద్యార్థి విజ్ఞా న్‌ మంథన్‌కు సంబంధించిన కరపత్రాన్ని సెక్టోరి యల్‌ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత ఆలోచనలను ఆవిష్కరించడం వైపు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ను అన్ని పాఠశాలల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని అత్యధిక సంఖ్యలో పరీక్షకు విద్యార్థులు హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు చొరవ చూపాలని సూచించారు. విద్యార్ధి విజ్ఞాన్‌ మంథన్‌ జిల్లా కోఆర్డినేటర్‌ నాగుల రవి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సాంకేతిక, సమాచార సంస్థ ఆధ్వర్యంలో ఎన్సీఈఆర్టీ, విజ్ఞాన్‌ భారతి సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహిస్తుందని తెలిపారు. ఆరు నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులని పేర్కొన్నా రు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలతో కలిసే అవకాశం, ప్రముఖ పరిశోధనా సంస్థలో ఇంటర్న్‌షిప్‌ చేసే సదుపాయం ఉంటుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ల కోసం www. vvm.inలో నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 9440589047 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. ఎస్వోలు రాజేశ్వర్‌, నర్సయ్య, ప్రవీణ్‌, లింబాద్రి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

క్రీడల్లో రాణించేలా చూడాలి

క్రీడల్లో రాణించేలా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని డీఈవో భోజన్న సూచించారు. జిల్లా కేంద్రంలోని కస్బ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వ్యాయామ ఉపాధ్యాయుల కాంప్లెక్స్‌ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలల్లో తప్పకుండా అకాడమిక్‌ క్యాలెండర్‌ను అమలుపరచాలని తెలిపారు. విద్యార్థులకు వ్యాయామ విద్య కోసం ప్రత్యేక పీరియడ్‌ కేటాయించాలని, క్రీడా పరికరాలు కొనుగోలు చేసి అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వార్షిక పరీక్షలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement