
స్వర్ణ ప్రాజెక్ట్ గేటు ఎత్తివేత
సారంగపూర్: రెండ్రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు స్వర్ణ ప్రాజెక్ట్‌లో కి వరద పోటెత్తింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,183 అడుగులు కాగా, 1,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు శనివారం రాత్రి 12గంటలకు ఒక గేటు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు వదిలారు. ఆదివారం సాయంత్రం వరకు కూ డా ఒక గేటు నుంచి నీటిని వదులుతున్నారు. రాత్రికి మళ్లీ వర్షం కురిస్తే ఏ సమయంలోనైనా మరిన్ని గేట్లు ఎత్తే అవకాశముందని అధికారులు తెలిపారు. స్వర్ణ నది పరీవాహక ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.