
అందని ‘గౌరవం’
సమగ్ర కుటుంబ సర్వే చేసిన
10 నెలలుగా ఎదురుచూపులే
ఎన్యూమరేటర్లు, డాటా ఎంట్రీ
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లావ్యాప్తంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే విధులు నిర్వర్తించిన ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు నేటికీ గౌరవవేతనం అందలేదు. సర్వే సందర్భంగా ప్రజల నుంచి ఎన్యూమరేటర్లు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అష్టకష్టాలూ పడి ప్రక్రియ పూర్తిచేశారు. సర్వే ప్రారంభానికి ముందే ప్రభుత్వం ప్రత్యే క నిధులు కేటాయించింది. అయినా గతేడాది నవంబర్‌లో సర్వే విధులు నిర్వహించిన వీరు గౌరవ వేతనం కోసం 10 నెలలుగా ఎదురుచూస్తున్నారు.
నిరుపేదలకు న్యాయం చేసేందుకే..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచడంతో పాటు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను నిరుపేదలకు అందించాలనే ఉద్దేశంతో రా ష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గతేడాది నవంబర్ 6నుంచి 21వరకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లు, మున్సిపల్ వార్డు అధి కారులు, సెర్చ్ సిబ్బంది, ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లుగా పనిచేశారు. సర్వే సందర్భంగా ఒక్కొక్క రూ 120నుంచి 150 కుటుంబాల చొప్పున ఎంచుకుని సమగ్రంగా వివరాలు సేకరించారు. ఈ ఇంటింటి సర్వే అనంతరం నవంబర్ 22నుంచి డిసెంబర్ 6వరకు కుటుంబ వివరాలను డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఆ సమయంలో కొందరు సర్వేకు అందుబాటులో లేకపోవడంతో తిరిగి మరోసారి వారి వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి వచ్చింది.
2,34,864 కుటుంబాల సర్వే
జిల్లాలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో 1,698 మంది ఎన్యూమరేటర్లు, 168 మంది సూపర్‌వైజర్లు విధులు నిర్వర్తించారు. ఒక్కో ఎన్యూమరేటర్ 150 కుటుంబాల చొప్పున సర్వే విజయవంతంగా పూర్తి చేశారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 86 వా ర్డులు, 400 గ్రామపంచాయతీల పరిధిలో మొత్తం 2,34,864 కుటుంబాలకు చెందిన సామాజిక, ఆర్థి క, విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ పరిస్థితులతో పాటు కులం వివరాలు కూడా నమోదు చేసుకున్నా రు. ఒక్కో కుటుంబానికి ఎనిమిది పేజీలతో కూడిన సర్వే ఫామ్‌లో 75రకాల ప్రశ్నలుండగా, ఆయా కు టుంబ సభ్యుల నుంచి ఎన్యూమరేటర్లు ఓపికతో వివరాలు సేకరించారు. నేరుగా కుటుంబాల వద్దకు వెళ్లి చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు, కు లం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వయస్సు, పశు సంపద, దివ్యాంగులు, వైవాహిక స్థితి, చదువు, ఫోన్ నంబర్, వృత్తి, ఉద్యోగం, స్వయం ఉపాధి, వ్యాపా రం, కార్మికులు, వార్షికాదాయం, ఆదాయ పన్ను చెల్లింపు, పట్టా భూమి, కౌలు రైతుల వివరాలు, రిజర్వేషన్ల ద్వారా పొందిన విద్య, ఉద్యోగ ప్రయోజనాలు, గత ఐదేళ్ల నుంచి పొందుతున్న ప్రభుత్వ పథకాలు తదితర వివరాలు నమోదు చేశారు. జిల్లాలో ప్రక్రియ 20 రోజుల్లో పూర్తి చేశారు.
జిల్లాలో పెండింగ్‌లో
రూ.2.06 కోట్ల బకాయిలు
సర్వేలో పాల్గొనే ఎన్యూమరేటర్లకు రూ.10వేల చొప్పున, సూపర్‌వైజర్లకు రూ.12వేల చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు కుటుంబాల వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చిన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో దరఖాస్తుకు రూ.7 చొప్పన ఇవ్వాల్సి ఉంది. జిల్లాలోని 2,34,864 కుటుంబాల డేటా ఎంట్రీ కోసం 2,164 మంది ఆపరేటర్లు పాల్గొన్నారు. వీరందరికీ కలిపి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.2.06 కోట్ల గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది. సర్వే పూర్తి కాగానే చెల్లిస్తామని చెప్పి ఇంతవరకు విడుదల చేయకపోవడంతో ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు.
సిబ్బందికి పారితోషికం రాలే..
ఆపరేటర్లకు తప్పని ఇక్కట్లు
సమగ్ర కుటుంబ సర్వే వివరాలు
నోడల్ అధికారులు 21
ఎన్యూమరేటర్లు 1,698
సూపర్‌వైజర్లు 168
డాటా ఎంట్రీ ఆపరేటర్లు 2,164
మాస్టర్ ట్రైనర్లు 5
స్టిక్కరింగ్ చేసిన కుటుంబాల
సంఖ్య 2,28,859
ఆన్‌లైన్ చేసిన కుటుంబాల
సంఖ్య 2,34,864