● నాటి ఇంజినీర్ల ప్రతిభకు ఆనవాళ్లు ● నేడు ఇంజినీర్స్‌ డే | - | Sakshi
Sakshi News home page

● నాటి ఇంజినీర్ల ప్రతిభకు ఆనవాళ్లు ● నేడు ఇంజినీర్స్‌ డే

Sep 15 2025 8:35 AM | Updated on Sep 15 2025 8:35 AM

● నాట

● నాటి ఇంజినీర్ల ప్రతిభకు ఆనవాళ్లు ● నేడు ఇంజినీర్స్‌ డ

● నాటి ఇంజినీర్ల ప్రతిభకు ఆనవాళ్లు ● నేడు ఇంజినీర్స్‌ డే

ఖానాపూర్‌: మండలంలోని మేడంపల్లి సమీపంలోగల గోదావరిపై 1891లో నిజాం పాలనలో ఫ్రెంచ్‌ ఇంజినీర్‌ జేజే ఒటలే సదర్‌మాట్‌ ఆనకట్ట నిర్మించారు. ఇది రెండు మండలాల్లోని సుమారు 15వేలకు పైగా ఎకరాలకు పైసా ఖర్చు లేకుండా 130 ఏళ్లుగా సాగునీరు అందిస్తోంది. ఎలాంటి సాకేంతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో పూర్తిగా రాళ్లతో గోదావరికి అడ్డంగా కట్టారు. దీనికి కుడి, ఎడమ కాలువలు నిర్మించారు. వీటి ద్వారా నీటిని విడుదల చేసేందుకూ ఎలాంటి టెక్నాలజీ, ఖర్చు అవసరం లేదు. చెరువు తూములాగే గేట్లు మనుషులే ఎత్తవచ్చు. అప్పట్లో వర్షాధారంగా నిండే నీటితోనే పంటలకు నీరందించేలా దీన్ని నిర్మించడం విశేషం. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత 1985–86వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సదర్‌మాట్‌కు నీళ్లు వచ్చాయి. ఆ తర్వాత నుంచి ప్రభుత్వాలు, అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆయకట్టు రైతులే పోచంపాడ్‌ వరకు వెళ్లి శ్రీరాంసాగర్‌ నుంచి నీళ్లు పోరాడి తెచ్చుకోవాల్సి వస్తోంది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విషయం తెలుసుకుని స్వయంగా తానే సదర్‌మాట్‌ వరకు వచ్చారు. నిపుణులతో సర్వే చేయించి సదర్‌మాట్‌ కాలువ, బ్యారేజీ నిర్మాణానికి రూ.386కోట్లు మంజూరు చేశారు. కాగా, ఆయన మరణానంతరం బ్యారేజీ నిర్మాణంలోనూ మార్పులు జరిగాయి. ప్రస్తుత ప్రభుత్వం ఎగువనున్న మామడ మండలం పొన్కల్‌ వద్ద గోదావరిపై సదర్‌మాట్‌ నూతన బ్యారేజీ నిర్మిస్తోంది. కాగా, కేంద్రప్రభుత్వం మూడేళ్ల క్రితం సదర్‌మాట్‌ను వారసత్వ సాగునీటి కట్టడంగా గుర్తించడం విశేషం.

● నాటి ఇంజినీర్ల ప్రతిభకు ఆనవాళ్లు ● నేడు ఇంజినీర్స్‌ డ1
1/2

● నాటి ఇంజినీర్ల ప్రతిభకు ఆనవాళ్లు ● నేడు ఇంజినీర్స్‌ డ

● నాటి ఇంజినీర్ల ప్రతిభకు ఆనవాళ్లు ● నేడు ఇంజినీర్స్‌ డ2
2/2

● నాటి ఇంజినీర్ల ప్రతిభకు ఆనవాళ్లు ● నేడు ఇంజినీర్స్‌ డ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement