
నిజాం నాటి ఆసిఫాబాద్ జైలు
ఆసిఫాబాద్: 1916లో అప్పటి జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో గల జన్కాపూర్‌లో ఐదెకరాల్లో జైలు నిర్మించారు. నిజాం హయాంలో దీనిని పూర్తిగా డంగుసున్నంతో కట్టారు. ఇందులో మూడు బారక్‌లు ఉన్నాయి. సుమారు 200 మంది ఖైదీలు ఉండేలా భవన నిర్మాణం చేపట్టారు. అనంతరం కొన్నేళ్లపాటు మూసి ఉండగా మరమ్మతులు చేసి 1991 మార్చి 15న అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఎంజీ గోపాల్ తిరిగి ప్రారంభించారు. 17 ఏళ్లపాటు తిరిగి జిల్లా జైలుగా కొనసాగగా అనంతరం ఆసిఫాబాద్ జిల్లా జైలును 2008లో ఆదిలాబాద్‌కు తరలించి, ఇక్కడి జైలును స్పెషల్ సబ్ జైలుగా మార్చారు.