
ఉత్తమ రైతుకు పురస్కారం
తానూరు: మండలంలోని బోంద్రట్ గ్రామానికి చెందిన ఉత్తమ రైతు సిందే సాయినాథ్ పు రస్కారం అందుకున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేటలోగల హరిత ప్లాజా హోటల్‌లో యూత్ ఫర్ యాంటీకరప్షన్ ఆధ్వర్యంలో ఆది వారం నిర్వహించిన కార్యక్రమంలో సీబీఐ మా జీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా సా యినాథ్ పురస్కారం స్వీకరించారు. సాయినా థ్ సేంద్రియ సాగుతో వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తుండగా యూత్ ఫర్ యాంటీకరప్షన్ సభ్యులు గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో యూత్‌ఫర్ యాంటికరప్షన్ చైర్మన్ అశోక్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.