
రైతు ఇంట కొత్త పంట
న్యూస్‌రీల్
నిర్మల్
పర్యాటకులకు నిరాశే..
దసరా సెలవుల్లో కవ్వాల్‌ను సందర్శించాలనుకునే పర్యాటకులకు ఈసారి నిరాశే మిగిలింది. అక్టోబర్ నుంచే సఫారీకి అనుమతివ్వాలని అటవీశాఖ నిర్ణయించింది.
ఖేలో ఇండియా పోటీలకు నిర్మల్ విద్యార్థులు
నిర్మల్‌టౌన్: జాతీయస్థాయి ఖేలో ఇండియా పోటీలకు నిర్మల్ జిల్లా విద్యార్థులు ఎంపికయ్యారు. ఈనెల 14న వరంగల్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన బాక్సింగ్ బాలికల రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌లో నిర్మల్ జిల్లా నుంచి 13 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. ఇందులో స మీక్ష ,అక్షిత (50 కేజీలు), నాగలక్ష్మి (40 కేజీ లు), చిన్మయి (35 కేజీలు), దివ్య (38 కేజీ లు), నక్షత్ర(70 కేజీలు) విభాగాల్లో జాతీయస్థాయికి ఎంపికయ్యారు. శిక్షకురాలు లక్ష్మి, జిల్లా కిక్ బాక్సింగ్ కార్యవర్గం జాతీయస్థాయికి ఎంపికై న క్రీడాకారులను అభినందించారు.
లక్ష్మణచాంద: జిల్లా వ్యవసాయ రంగంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. శ్రీరామ్‌సాగర్, గడ్డెన్న, కడెం, స్వర్ణ, సదర్‌మాట్ వంటి ప్రాజెక్టులతో సాగు నీటికి ఎలాంటి కొరత లేకుండా ఉంది. దీంతో జిల్లాలో 85 శాతం మందివ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.జిల్లా రైతులు ఎక్కువగా పత్తి, సోయాబీన్, వరి పంటలు సాగు చేస్తున్నారు. ఈ పంటలు రైతులకు దీర్ఘకాలంగా ప్రధాన ఆధారంగా ఉన్నప్పటికీ, సరైన దిగుబడి, ధరలు లేక నష్టాలను ఎదుర్కొంటున్నారు.
వాణిజ్య పంటల సాగు..
ఒకే రకమైన పంటల సాగుతో రైతులు నష్టపోతున్న నేపథ్యంలో, ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తూ రైతులను ఆర్థికంగా ఉన్నత దిశగా నడిపించేందుకు కృషి చేస్తోంది. ఫలితంగా, జిల్లాలో అనేకమంది రైతులు ఆయిల్‌పామ్ సాగును ఆదరిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 8,200 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతోంది. ఈ ఏడాది 4,500 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటివరకు 1,500 ఎకరాల్లో మొక్కలు నాటారు. మిగిలిన లక్ష్యాన్ని చేరుకునేందుకు రైతులను చైతన్యం చేస్తున్నామని హార్టికల్చర్ అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు రావాలని కోరుతున్నారు.
రైతులకు ప్రభుత్వ సహకారం..
ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీలతో అండగా నిలుస్తోంది. ఒక ఎకరంలో 50 ఆయిల్‌పామ్ మొక్కలు నాటేందుకు, బహిరంగ మార్కెట్లో రూ.200 ధర ఉన్న మొక్కను 90 శాతం సబ్సిడీతో రూ.20కే అందిస్తోంది. అదనంగా, నీటి వృథాను నివారించేందుకు డ్రిప్ సేద్యం కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీ అందిస్తోంది. మొక్కల నిర్వహణ ఖర్చుల కోసం ఎకరానికి ఏడాదికి రూ.4,200 చొప్పున నాలుగేళ్లు ఆర్థికసాయం కూడా అందజేస్తోంది.
తొలి దిగుబడి ఫలితాలు..
నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన ఆయిల్‌పామ్ సాగు ఇప్పుడు తొలి దిగుబడిని అందించింది. 8,200 ఎకరాల సాగులో, 121 మంది రైతులకు చెందిన 542 ఎకరాల్లో 114.390 టన్నుల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ఒక టన్ను గెల ధర రూ.19 వేలు పలుకుతోంది. ఒక ఎకరానికి 2 నుంచి 3 టన్నుల దిగుబడి వస్తుండగా, ఐదో సంవత్సరం నుంచి ఎకరానికి 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుందని అధికారులు తెలిపారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు..
జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, లక్ష్మణచాంద, లోకేశ్వరం, భైంసా, సోన్ మండల కేంద్రాల్లో ఆయిల్‌పామ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా రైతుల నుంచి గెలలను సేకరిస్తున్నారు. కొనుగోలు చేసిన రైతుల బ్యాంకు ఖాతాల్లో వారం రోజుల్లో డబ్బులు జమ అవుతాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో ప్రి–యూనిక్ కంపెనీ గెలల కొనుగోలు చేస్తోంది

రైతు ఇంట కొత్త పంట