
మెనూ పాటించరా?
ఖానాపూర్: పట్టణంలోని శాంతినగర్ కాలనీ మహాత్మా జ్యోతిబాపూలే బాలుర పాఠశాలలో భోజన మెనూ పాటించకపోవడంతో సంబంధిత అధికారులు, సిబ్బందిపై ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎంజేపీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మెనూ ప్రకారం కిచిడి, టమాటా పెట్టాల్సి ఉండగా పప్పు, అన్నం పెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం స్థానిక అధికారుల నిర్లక్ష్యం లేకుండా దృష్టిసారించాలని ఆదేశించారు. ఈ విషయమై సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. పాఠశాలకు వచ్చిన సరుకులను పరిశీలించారు. అనంతరం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అక్కడి నుంచి పట్టణంలోని శాంతినగర్‌తోపాటు దిలావర్‌పూర్ గ్రామానికి వెళ్లి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అంతకుముందు క్యాంపు కార్యాలయంలో తిమ్మాపూర్ వీడీసీ నాయకులు ఎమ్మెల్యేను కలిసి ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణం కొనసాగేలా చూడాలని విన్నవించారు. కనీస అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా సబ్‌సెంటర్ నిర్మాణం చేపట్టడం సమంజసం కాదన్నాన్నారు. ఈ విషయమై సంబంధిత డీఈతో ఫోన్‌లో మాట్లాడి దీనికి పూర్తి బాధ్యత అధికారులే వహించాలని స్పష్టం చేశారు. ఓ వైపు ప్రభుత్వం హైడ్రా పేరుతో ఎఫ్‌టీఎల్ పరిధిలోని నిర్మాణాలు తొలగిస్తుంటే సంబంధిత అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడం సరికాదన్నారు. కార్యక్రమంలో నాయకులు దయానంద్, తోట సత్యం, చిన్నం సత్యం, నిమ్మల రమేశ్, సత్యనారాయణ, రాజేశ్వర్, గంగనర్సయ్య, తదితరులు ఉన్నారు.