
మున్నూరుకాపుల సంక్షేమానికి కృషి
ఖానాపూర్: ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న మున్నూరుకాపుల సంక్షేమానికి గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ కృషి చేస్తోంద ని ఖానాపూర్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐలు పన్నెల జనార్దన్, చింతపండు వేణుగోపాల్ అన్నా రు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన జీఎంఏ సభకు హాజరై మాట్లాడారు. వివిధ ప్రాంతాల్లోని మున్నూరుకాపు యువతకు విదేశాల్లో విద్య, ఉద్యోగ, ఉపాధి, ఇమ్మిగ్రేష న్, తదితర వాటికి సంబంధించిన సహకారం అందేలా జీఎంఏ కృషి చేస్తోందని జీఎంఏ ఫౌండర్ రంజిత్ సంఘాని అన్నారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, తె లంగాణ మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.