
పారిశుధ్య సమస్య పరిష్కరించాలి
సారంగపూర్: పారిశుధ్య సమస్య పరిష్కరించాలని డీపీవో శ్రీనివాస్ సూచించారు. మండలంలోని స్వర్ణ గ్రామంలో బుధవారం ఆయన పారిశుధ్య పనులు, తాగునీరు, మురుగు కా లువలు, సెగ్రిగేషన్ షెడ్డు పరిశీలించారు. ఆశ్ర మ పాఠశాలను పరిశీలించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వాటర్ ట్యాంక్‌ను ఎ ప్పటికప్పుడు శుభ్రం చేయించాలని సిబ్బందికి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వే గవంతం చేసేందుకు లబ్ధిదారులు, మేసీ్త్రలతో సమావేశం నిర్వహించి వారికి సూచనలు చే యాలని ఎంపీవో అజీజ్‌ఖాన్, ఎంపీడీవో లక్ష్మీకాంత్‌రావుకు సూచించారు. సెగ్రిగేషన్ షెడ్డు లో తయారైన ఎరువును పరిశీలించారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించేలా ప్రజలకు అ వగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం స్వర్ణ ప్రాజెక్ట్‌ను పరిశీలించి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలు తెలుసుకున్నారు.