
అంగన్‌వాడీ కేంద్రం పరిశీలన
లోకేశ్వరం: మండలంలోని బామ్నికే గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సుపోషిత్ జీపీ అ భియాన్ కేంద్ర బృందం సభ్యుడు అలోక్‌శర్మ బుధవారం పరిశీలించారు. కేంద్రంలోని చిన్నారుల పోషణ స్థితి, అంగన్‌వాడీ కేంద్రాలకు అందించే ఆహార పదార్థాల నాణ్యత, పిల్లల బరు వు పరిశీలించి మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లలు అధికసంఖ్యలో వచ్చేలా చూ డాలని సూచించారు. సీడీపీవో స్టేట్ కన్సల్టెంట్ విజయ తాపక్, స్టేట్ కన్సల్టెంట్ అశోక్, జిల్లా పోషణ అభియాన్ కోఆర్డినేటర్ నిరంజన్‌రెడ్డి, ముథోల్, ఖానాపూర్, నిర్మల్ సీడీపీవోలు సరో జిని, నాగలక్ష్మి, సరిత, సెక్టార్ సూపర్‌వైజర్ మీ నా, అంగన్‌వాడీ టీచర్ పాల్గొన్నారు.