ఎమ్మెల్యేల క్షేత్రస్థాయి పర్యటన | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేల క్షేత్రస్థాయి పర్యటన

Sep 4 2025 5:45 AM | Updated on Sep 4 2025 5:45 AM

ఎమ్మె

ఎమ్మెల్యేల క్షేత్రస్థాయి పర్యటన

బాసర: భారీ వర్షాలకు మండలంలో దెబ్బతిన్న పంటలను ముధోల్‌ ఎమ్మెల్యే రామారావు పటే ల్‌ బుధవారం పరిశీలించారు. మండల కేంద్రంలోని రేణుకాపూర్‌ శివారు, బిద్రెల్లి, ఓని, మైలా పూర్‌ తదితర గ్రామాల్లో దెబ్బతిన్న సోయా, ప త్తి పంటలు, ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలు పరిశీలించారు. వ్యవసాయాధికారి అజ య్‌, తహసీల్దార్‌ పవన్‌చంద్ర, ఎంపీడీవో దేవేందర్‌రెడ్డితో మాట్లాడి పంటనష్టం వివరాలు తె లుసుకున్నారు. తక్షణమే ప్రభుత్వానికి నివేదిక అందించాలని సూచించారు. అధైర్య పడొద్దని, అండగా ఉంటామని బాధిత రైతులకు భరోసా కల్పించారు. పంట నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని, ఎకరాకు రూ.30వేల నుంచి రూ.40వేల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట నాయకులు సతీశ్‌రావు, సాయినాథ్‌, రమేశ్‌, ప్రతా ప్‌రావు, నర్సింగరావు, శీనుయాదవ్‌, నారాయణరెడ్డి, సాయిబాబా, ఓని శివాజీ, దావా రాజు, సాయినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

నర్సాపూర్‌ (జీ) మండలంలో ‘ఏలేటి’

నర్సాపూర్‌ (జీ): మండల కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. వర్షంలో తడుస్తూనే.. దేవుని చెరువు కట్ట కు ఏర్పడిన గండిని పరిశీలించి మరమ్మతు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. దిగువన దెబ్బతిన్న పంటలను పరిశీ లించి బాధిత రైతులకు పరిహారం అందేలా చ ర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువు కట్ట తెగి చేపలు, వలలు కొట్టుకుపోయి తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని మత్స్యకారులు తెలుపగా.. పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని మ త్స్యశాఖ అధికారులను ఆదేశించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు చేపట్టాలని పీఆర్‌, ఆర్‌అండ్‌ బీ అధికారులు, విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలని ఏఈకి సూచించారు. తహసీల్దార్‌ శ్రీకాంత్‌, ఇరిగేషన్‌ ఏఈ గంగాధర్‌, పీఆర్‌ ఏఈ క్రాంతి కుమార్‌, విద్యుత్‌ ఏఈ శంకర్‌, ఎంపీవో తిరుపతిరెడ్డి, ఏఈవో భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, నాయకులు నరేందర్‌, చిన్న య్య, ముత్యంరెడ్డి, దత్తురాం, సుధాకర్‌, గంగా రాం, శ్రీకాంత్‌రెడ్డి, ప్రవీణ్‌ పటేల్‌, మహిపాల్‌, సాయన్న, భోజన్న తదితరులు పాల్గొన్నారు.

పెంబి మండలంలో బొజ్జు

పెంబి: మండలంలోని తాటిగూడ గ్రామ శివారులో కడెం వాగు ప్రవాహ ప్రాంతంలో కొట్టుకుపోయిన పత్తి పంటను ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకుంటుందని తెలిపారు. నష్టపోయిన ప్రతీ రైతుకు న్యా యం జరుగుతుందని పేర్కొన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ లక్ష్మణ్‌, ఏవో నవీన్‌, నాయకులు శంకర్‌, రమేశ్‌, రాజన్న, మహేందర్‌, రమేశ్‌, భీంరావు, భూమేశ్‌ తదితరులున్నారు.

ఎమ్మెల్యేల క్షేత్రస్థాయి పర్యటన1
1/2

ఎమ్మెల్యేల క్షేత్రస్థాయి పర్యటన

ఎమ్మెల్యేల క్షేత్రస్థాయి పర్యటన2
2/2

ఎమ్మెల్యేల క్షేత్రస్థాయి పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement