
నిర్మల్
న్యూస్‌రీల్
ఇక నెలనెలా బిల్లుల చెల్లింపు
ప్రతీనెల 10వ తేదీ లోపు జమ
అమలుకు అధికారుల కసరత్తు
హర్షం వ్యక్తంజేస్తున్న కార్మికులు
‘కడెం’కు కొనసాగుతున్న వరద
ఎగువ నుంచి వస్తున్న వరదతో జిల్లాలోని క డెం, గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
వంట ఏజెన్సీల
IIలోu
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
భైంసాటౌన్: పట్టణంలోని సుభద్రవాటిక శ్రీసరస్వతి శిశుమందిర్ పాఠశాల విద్యార్థులు సై న్స్‌ఫేర్ పోటీల్లో ప్రతిభ చాటారు. ఇటీవల ఆ దిలాబాద్‌లో నిర్వహించిన విభాగ్‌స్థాయి విజ్ఞా న మేళా పోటీల్లో సైన్స్, మ్యాథ్స్ మోడల్స్, నూతన ఆవిష్కరణ, సైన్స్, వేద గణితం, క్వి జ్, పద ప్రయోగాలు అంశాల్లో ప్రతిభ కనబరి చినట్లు ప్రధానాచార్యులు దేవేందర్ తెలిపారు. వీరు ఈనెల 12,13,14 తేదీల్లో కామారెడ్డిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం విద్యార్థులను పాఠశాల ప్రబంధకారిణి సభ్యులు, ఉపాధ్యాయులు అభినందించారు.
లక్ష్మణచాంద: సకాలంలో బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికో న్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం త యారు చేస్తున్న ఏజెన్సీల కష్టాలు తీరనున్నాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నెల నెలా 10వ తేదీలోపు గ్రీన్ చానెల్ ద్వారా బిల్లులు చెల్లించాలని నిర్ణయించింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండురోజుల కిందట విద్యాశాఖపై ఉ న్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు
మధ్యాహ్న భోజన పథకం అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తున్నాయి. 1–5 తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.6.78 చొప్పు న, 6–8 తరగతుల వారికి రూ.10.17 చొప్పున, 9,10 తరగతుల వారికి రూ.10.67 చొప్పున చెల్లి స్తారు. ఒక్కో కోడి గుడ్డుకు రూ.6 చెల్లిస్తున్నారు. మ ధ్యాహ్న భోజనం తయారు చేసే వంట కార్మికులకు కేంద్రం రూ.2వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి ఇలా నెలకు రూ.3వేల గౌరవ వేతనం ఇస్తున్నాయి.
ఇప్పటివరకు చెల్లింపులు ఇలా..
నెలనెలా మధ్యాహ్నం భోజన బిల్లులను ముందుగా ప్రధానోపాధ్యాయుడు ఎంఈవో కార్యాలయానికి పంపుతారు. ఆ బిల్లులను మండల విద్యాధి కారి జాగ్రత్తగా పరిశీలించి జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపుతారు. అక్కడి అధికారులు పరిశీ లించి డీఈవో ఆమోదంతో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపితే అక్కడ నుంచి బిల్లుల ని ధులు విడుదలవుతాయి. ఈ విధానంతో బిల్లుల చె ల్లింపులు ఆలస్యం కావడంతో వంట ఏజెన్సీలు అ ప్పులపాలవుతున్నారు. దీంతో వారి ఇబ్బందులను తీర్చేందుకు ప్రభుత్వం గ్రీన్ చానెల్ ద్వారా నెల నెలా బిల్లులు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.
జిల్లా కేంద్రంలోని కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వంట చేస్తున్న కార్మికులు (ఫైల్)
ఇక బిల్లుల చెల్లింపులు ఇలా..
మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంతో వంట కార్మికులకు నెలనెలా బిల్లులు అందుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రధానోపాధ్యాయుడు బిల్లులు పరిశీలించి ఆమోదించి వెంటనే ఎంఈవోకు ఆన్‌లైన్‌లో పంపిస్తారు. ఎంఈవో పరిశీలించి బిల్లులు సక్రమంగా ఉంటే వెంటనే ట్రెజరీ ద్వారా బిల్లు మొత్తం ప్రతినెలా 10లోపు వంట కార్మికుల ఖాతాల్లో జమయ్యేలా చూస్తారు.
జిల్లా సమాచారం
మొత్తం పాఠశాలలు 830
విద్యార్థుల సంఖ్య 67,790
వంట ఏజెన్సీలు 830
వంట కార్మికులు 1,145