
రాయితీ యంత్రం.. రైతుకు ఊతం
నిర్మల్‌చైన్‌గేట్: రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరి కరాలు అందజేసే యాంత్రీకరణ పథకానికి నిధులు మంజూరయ్యాయి. జిల్లాకు రూ.3.35 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. స బ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (ఎస్‌ఎంఏఎం) పథకం కింద ఈ నిధులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వానిది 60 శాతం వాటా కాగా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరిస్తుంది. గత యాసంగిలోనే ప్రక్రియ ప్రారంభించినా మార్చి బడ్జెట్ ముగింపు సందర్భంగా ఏర్పడిన సాంకేతిక కారణాలతో నిధులు విడుదల కాలేదు. ప్రస్తుతం ముందస్తుగానే ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
ఎంపిక బాధ్యత కమిటీలదే
వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందజేసేందుకు జిల్లా, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చే యనున్నారు. రాయితీ రూ.లక్ష దాటితే జిల్లా కమి టీ ఆమోదం తప్పనిసరి. ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న వారు ఈ రాయితీ పథకానికి అర్హులు. జిల్లా కమిటీలో కలెక్టర్ చైర్మన్‌గా, డీఏవో, ఆగ్రోస్, ఎల్డీఎం, శాస్త్రవేత్త సభ్యులుగా ఉండనున్నారు. మండల స్థాయి కమిటీలో మండల వ్యవసాయాధికారి, తహసీల్దార్, ఎంపీడీవోలు ఉంటారు. ఈ పరికరాల కోసం అర్హులను ఈ కమిటీలు ఎంపిక చేయనున్నాయి. 2017–18 సంవత్సరం వరకు యాంత్రీకరణ పథకం అమలులో ఉంది. మళ్లీ ఏడేళ్ల తర్వాత పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. గతంలో ట్రాక్టర్లు అందించగా, ఈ ఏడాది యాంత్రీకరణ పనిముట్ల వరకే పరిమితం చేశారు.
సబ్సిడీ.. పనిముట్ల వివరాలు
ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ పనిముట్లలో మహిళా రైతులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 50 శా తం సబ్సిడీపై పరికరాలు అందించనున్నారు. మిగతా రైతులకు 40శాతం సబ్సిడీ వర్తిస్తుంది. ఐదెకరా ల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు సబ్సిడీపై స్ప్రేయర్లు, ట్రాక్టర్‌తో వినియోగించే రొటోవేటర్లు, నాగళ్లు, కలుపుతీసే యంత్రాలు, పవర్ టిల్లర్లు, మొక్కజొన్న తీసే యంత్రాలు తదితర పరికరాలు అందజేసేందుకు చర్యలు చేపడతారు.
జిల్లాకు కేటాయించిన సబ్సిడీ పరికరాలు
యంత్రాల పేర్లు యూనిట్లు నిధులు
(రూ.లక్షల్లో)
బ్యాటరీ, చేతి,
మ్యానువల్స్ స్పేయ్రర్లు 3,238 32.38
పవర్ నాప్
సాక్ స్పేయ్రర్లు 525 52.50
రొటోవేటర్లు 239 119.50
విత్తన ఫర్టిలైజర్
వేసే యంత్రాలు (గొర్రు) 50 15.00
ట్రాక్టర్ పరికరాలు 290 58.00
బండ్ ఫార్మర్లు 6 0.90
పవర్ వీడర్స్ 50 17.50
బ్రష్ కట్టర్లు 41 14.35
పవర్ టిల్లర్స్ 25 25.00