
ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
నిర్మల్‌చైన్‌గేట్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వే గం పెంచి త్వరగా పూర్తి చేయించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వనమహోత్సవం, గ్రామాల్లో పారిశుధ్య పనులు త దితర అంశాలపై సంబంధిత అధికారులతో సమావేశమై మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షించాలని, ఇసుక కొరత రాకుండా చూడాలని సూచించారు. డబ్బులు లేని లబ్ధిదారులకు మహిళా స్వయం సంఘాల ద్వా రా రుణాలు ఇప్పించాలని తెలిపారు. జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమాన్ని వెంటనే పూర్తిచేయాలని, మొక్కలు నాటిన వెంటనే సంబంధిత సైట్‌లో నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో మొక్కలు నాటే ప్రక్రియ దాదాపు పూర్తయిందని, మిగతా లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇటీవల భారీ వర్షాలు కురిసినందున గ్రామాల్లో మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించా రు. గ్రామాలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫాగింగ్ చే యించాలని, నీరు అధికంగా నిల్వ ఉండే చోట దో మలు వ్యాప్తి చెందకుండా ఆయిల్‌బాల్స్ వేయాలని తెలిపారు. ఇటీవల వర్షాలు కురిసి వరదలు సంభవించిన నేపథ్యంలో క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టిన అధి కారులందరినీ అభినందించారు. స్థానిక సంస్థల అ దనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీపీవో శ్రీనివాస్, జె డ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ రాజేశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.