
సామాజిక స్పృహ పెంచేలా..
ఖానాపూర్: మండలంలోని మస్కాపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న బోనగిరి నరేందర్ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నా డు. పాఠశాలలో మాతృపితృ వందనం కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పెద్దలపై గౌర వం పెంచేందుకు కృషి చేస్తున్నాడు. గుప్పెడు బియ్యం వంటి కార్యక్రమాలతో ఆపదలో ఉన్నవారికి చేయుత అందించేలా సామాజిక స్పృహ కలిగిస్తున్నాడు. ఉపాధ్యాయులు పా రదర్శకంగా విధులు నిర్వర్తించేలా పాఠశాలలో కంప్‌లైట్ బాక్స్ ఏర్పాటు చేశాడు. అతని సేవలను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది. కడెం మండలంలోని లింగాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన 2024లో హెచ్‌ఎంగా బాధ్యతలు స్వీకరించారు. 2024 –25 విద్యాసంవత్సరంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో 265 మంది బడిబయటి విద్యార్థులకు పాఠశాలలో ప్రవేశం కల్పించాడు. దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య జిల్లాలోనే అత్యధికంగా 830కి చేరుకుంది. 2025 విద్యాసంవత్సరంలో పాఠశాలలో పదోతరగతి పూర్తిచేసిన 12 మంది విద్యార్థులు ట్రిపుల్‌ఐటీకి, నలుగురు ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్‌కు ఎంపికయ్యారు. సాయి అనే విద్యార్థి ఢిల్లీలో నిర్వహించిన జాతీయస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. 9 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పతకాలు సాధించారు. అన్ని ఫోరమ్‌లలో (గణితం, ఇంగ్లీషు, ఫిజిక్స్, జీవశాస్త్రం, సోషల్) విద్యార్థులు జిల్లాస్థాయిలో మొదటి మూడు స్థానాల్లో రాణించి రాష్ట్రస్థాయిలో పాల్గొన్నారు. ఏడుగురు విద్యార్థులు డీఆర్‌డీఏ ద్వారా ఉచితంగా కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలు పొందారు. గతేడాది పదోతరగతి ఫలితాల్లో 56 మంది విద్యార్థులు 500కుపైగా మార్కులు సాధించారు. 2025లో ఉత్తమ పాఠశాలగా మస్కాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ ఎంపికై ంది.