
‘మధ్యాహ్న’ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఖానాపూర్: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సులోచన అన్నారు. మండలంలోని మస్కాపూర్‌లో గురువారం నిర్వహించిన ద్వితీయ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. నెలకు రూ.10వేల వేతనంతో పాటు యూనిఫాం, ఐడీ కార్డులు, 60 ఏళ్లు పైబడిన కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.2లక్షలు అందజేయాలన్నారు. అనంతరం 19 మంది సభ్యులతో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షురాలిగా గంగామణి, అధ్యక్షురాలిగా గోదావరి, ఉపాధ్యక్షులుగా లక్ష్మి, సత్తవ్వ, గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా రాధ, సహాయ కార్యదర్శులుగా రేణుక, రాజవ్వ, లక్ష్మి, రాజేశ్వర్, కోశాధికారిగా వందన ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్, తదితరులు పాల్గొన్నారు.