
ఖానాపూర్/భైంసాటౌన్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రజల్లో చెరగని ముద్ర వేశారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కాంగ్రెస్ పార్టీ ముధోల్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బి.నారాయణ్‌రావు పటేల్ అన్నారు. ఖానాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, భైంసాలోని కాంగ్రెస్ కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి మంగళవారం నిర్వహించారు. రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంక్షేమ పథకాల ఆద్యుడు వైఎస్సార్ అని తెలిపారు. జలయజ్ఞం, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్, తదితర పథకాలతో ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని వివరించారు.
బాసరలో ట్రిపుల్ ఐటీ వైఎస్సార్ హయాంలోనే ఏర్పాటైందని తెలిపారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టును సైతం నిర్మించినట్లు గుర్తు చేశారు. బాసరలో గోదావరిపై 12 లిఫ్ట్‌లు నిర్మించారని తెలిపారు. కార్యక్రమాల్లో దయానంద్, భూషణ్, మాజిద్, నిమ్మల రమేశ్, చిన్నం సత్యం, అంకం రాజేందర్, మడిగెల గంగాధర్, గంగనర్సయ్య, మదిరె సత్యనారాయణ, రమేశ్, శేషాద్రి, సంతోష్, రాజునాయక్, శంకర్, గంగాధర్, శ్రీహరి, జహీర్, శంకర్ చంద్రే, ఆత్మ చైర్మన్ వివేకానంద, భోజరాం పాటిల్, బషీర్, బంక బాబు, సందీప్, నరేందర్‌రెడ్డి, ఆత్మరామ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల గుండెల్లో వైఎస్సార్