
ఫోన్ పోతే ఆందోళన వద్దు
నిర్మల్ టౌన్: మొబైల్ ఫోన్ పొతే ఆందోళన వద్దని, ఫోన్ పోతే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో లేదా మీ సేవ ద్వారా ఫిర్యాదు చేయాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న 65 ఫోన్ల ను సీఈఐఆర్ వెబ్‌సైట్ ద్వారా గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ జానకీ షర్మిల జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో మంగళవారం అందజేసి మాట్లాడారు. సెకండ్ హాండ్ ఫోన్లు కొనేముందు సీఈఐఆర్ వెబ్‌సైట్‌లో ఫోన్ ఐఎంఈఐ నంబర్ నమోదు చేసి చెక్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు పోయిన 1,631 ఫోన్లను రికవరీ చేశామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఐటీ కోర్, వివిధ పోలీస్‌స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.