పార్డి(బి) గ్రామంలో.. | - | Sakshi
Sakshi News home page

పార్డి(బి) గ్రామంలో..

Aug 9 2025 7:54 AM | Updated on Aug 9 2025 7:54 AM

పార్డ

పార్డి(బి) గ్రామంలో..

కుభీర్‌: మండలంలోని పార్డి (బీ) గ్రామ సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగశివుని తండాకు చెందిన పవార్‌ సచిన్‌ అనే యువకుడు మృతి చెందాడు. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సచిన్‌ తన బైక్‌పై సాయంత్రం కుభీర్‌ సంతకు వస్తుండగా పార్డి(బీ) సమీపంలో పంది తగిలి క్రిందపడి తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం అతడిని భైంసాకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. అతడి భార్య సిమ్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతోపాటు కూతురు, తల్లితండ్రులు ఉన్నారు.

పాము కాటుకు యువకుడి మృతి

దహెగాం: పాము కా టుకు గురైన యువకు డు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలో ని పంబాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పంబాపూర్‌ గ్రామానికి చెందిన కంబాల మహేశ్‌ (22) ఈనెల 2న ఇంట్లో ఉండగా లగ్గాం గ్రామానికి చెందిన బాబా అనే వ్యక్తి ఫోన్‌ చేసి బాత్రూమ్‌లో పాము ఉంది కొట్టడానికి రావాలని పిలిచాడు. దీంతో మహేశ్‌ వెంటనే బాబా ఇంటికి వెళ్లి బాత్రూమ్‌ డోర్‌ తీస్తున్న క్రమంలో పాము కాటు వేసింది. వెంటనే మహేశ్‌ కుటుంబీకులకు విషయం తెలుపగా దహెగాం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లికి తీసుకువెళ్లారు. అక్కడి నుండి మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మహేశ్‌ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి పెదనాన్న పోశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విక్రమ్‌ తెలిపారు.

చికిత్స పొందుతూ మృతి

జన్నారం: జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగిన వ్యక్తి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఎస్సై అనూష తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రోటిగూడకు చెందిన గాలి నాగేశం (40) రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయ్‌కి వెళ్లి పని దొరకక ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చడానికి భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. అయినా అప్పు తీరకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఈనెల 5న మద్యం మత్తులో గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య విజయ, కూతురు, కొడుకు ఉన్నారు. విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

పార్డి(బి) గ్రామంలో.. 
1
1/1

పార్డి(బి) గ్రామంలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement