
‘వృక్ష’ రక్షా బంధన్
నిర్మల్: జిల్లాకేంద్రంలోని ఈద్‌గాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ‘వృక్ష రక్షాబంధన్’ నిర్వహించారు. నేషనల్ గ్రీన్‌కోర్ జిల్లా సమన్వయకర్త మోహన్‌రావు, ఉపాధ్యాయుల సహకారంతో తాము తయారుచేసిన సహజసిద్ధమైన రాఖీలను విద్యార్థులు చెట్లకు కట్టారు. ‘నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష’, ‘వృక్షో రక్షతి రక్షితః’ అంటూ ఆ రాఖీలపై రాసి చెట్లను కాపాడుకోవాలని సందేశాన్నిచ్చారు. ఇందులో పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం, ఎన్‌జీసీ కోఆర్డినేటర్ మోహన్‌రావు, ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, రాజు, కృష్ణకుమార్, వివేక్, ఉజ్వల, స్వాతి, విద్యార్థులు పాల్గొన్నారు.