
వాతావరణం
ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంకనాన తగ్గుతాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో చాలాచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.
నిర్మల్‌లోనే ఏర్పాటు చేయాలి..
కాకతీయ యూనివర్సిటీ దూరభారమవుతోంది. ఏ చిన్న అవసరమైనా అంతదూరం వెళ్లడం ఇబ్బందవుతోంది. నిర్మల్‌లోనే యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి.
–సుభాష్, అసిస్టెంట్ ప్రొఫెసర్,
జీడీసీ, నిర్మల్
కలిసి ముందుకెళ్దాం..
రాజకీయ నాయకుల నిర్లక్ష్యంతోనే విశ్వవిద్యాలయాలు ప్రశ్నార్థకంగా మారాయి. యూనివర్సిటీ ఏర్పాటు కోసం కలిసికట్టుగా సాగుదాం.
– స్వదేశ్‌పరికిపండ్ల, ఎన్‌ఆర్‌ఐ అడ్వైజరీ కమిటీ మెంబర్
జయశంకర్‌సార్ స్ఫూర్తితో...
ఆచార్య జయశంకర్ స్ఫూర్తితో ఐక్యంగా వర్సిటీ కోసం ఉద్యమిద్దాం. పక్కా ప్రణాళికతో సాధించుకుందాం. ‘సాక్షి’ సామాజిక బాధ్యత అభినందనీయం.
–కిశోర్, సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ
ఉద్యమంతోనే
విశ్వవిద్యాలయం..
తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాను సాధించుకున్నట్లే ఉద్యమంతోనే విశ్వవిద్యాలయాన్ని సాధించుకుందాం. చదువులమ్మ జిల్లాలో విద్యాభివృద్ధి చేసుకుందాం. –షేర్ నరేందర్,
నిర్మల్ బార్‌అసోసియేషన్ సెక్రెటరీ
జిల్లాకో వర్సిటీ ఉంటే
తప్పేంటి..?
పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను ఏర్పాటు చేసినట్లు, విద్యార్థుల శ్రేయస్సు కోసం జిల్లాకో యూనివర్సిటీ పెడితే తప్పేంటి..!? నిర్మల్ జిల్లాలోనూ వర్సిటీ పెట్టాలి.
– కొమ్మోజి రమణ, న్యాయవాది
వర్సిటీతో ఎన్నోలాభాలు..
విశ్వంలోని సమస్త విషయాలపై పరిశోధనలు చేసి, పరిష్కారాలు చూపేదే విశ్వవిద్యాలయం. అలాంటి వర్సిటీ జిల్లాలో ఉంటే ఎన్నోరకాల లాభాలు ఉంటాయి. స్థానిక విద్యార్థులకు ఉపయోగకరం.
– డా.మధు, అసిస్టెంట్ ప్రొఫెసర్

వాతావరణం

వాతావరణం

వాతావరణం

వాతావరణం

వాతావరణం