
స్వర్ణ ప్రాజెక్ట్ గేటు ఎత్తివేత
సారంగపూర్: మహారాష్ట్రలో గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు స్వర్ణ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు చేరడంతో అధికారులు మూడో గేటు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,183 అడుగులు (1.484 టీఎంసీలు) కాగా, ఉదయం 6గంటల వరకు ఏకంగా 80వేల క్యూసెక్కులు రావడంతో 1,182.5 అడుగులకు చేరింది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ మూడో గేటు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు నీటిని వదిలారు. ప్రస్తుతం 1,182.5 అడుగుల వద్ద నీటిమట్టం స్థిరంగా ఉంచామని ఏఈ మధుపాల్ తెలిపారు.