నిర్మల్
శనివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2025
మరో ఉద్యమానికి సిద్ధం..
అలుపెరగని ఉద్యమంతోనే తెలంగాణ సాధించుకున్నాం, ఇప్పుడు అదేతరహాలో జిల్లాలో యూనివర్సి టీ సాధన కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావా ల్సిన అవసరం ఉంది. ఇందుకోసం సమష్టిగా కృషిచేద్దాం. – ఎంసీ లింగన్న,
నిర్మల్ సిటీజన్స్‌ఫోరం జిల్లా అధ్యక్షుడు
పోరాడి సాధించుకుందాం..
జిల్లాలో జ్ఞానసరస్వతీమాత పేరిట యూనివర్సిటీ సాధన కోసం అన్నివర్గాలు స్పందించాలి. పోరాడితేనే విశ్వవిద్యాలయం సాధించుకోగలుగుతాం.
– శశిరాజ్, టీపీయూఎస్ రాష్ట్రబాధ్యులు
తేడా స్పష్టంగా తెలుస్తోంది..
కాకతీయ యూనివర్సిటీ ఉన్న వరంగల్‌లో ఎస్జీటీ టీచర్లలోనూ 70 శాతం మంది పీహెచ్‌డీలు ఉన్నారు. అదే మనజిల్లాలో కేవలం 7 శాతమే ఉన్నారు. విశ్వవిద్యాలయం అందుబాటులో ఉంటే సమీప జిల్లాల్లో విద్యాఫలాలు ఎలా ఉంటాయో తేడా స్పష్టంగా తెలుసుకోవచ్చు.
– రవికుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్,
జీడీసీ, భైంసా
మహిళలకు దూరం..
మహిళలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ మన ప్రాంతంలో ఇప్పటికే ఉన్న ఉమెన్స్ కాలేజీ వెన క్కి వెళ్లిపోవడం శోచనీయం. యూనివర్సిటీ లేక చాలామంది మహిళలు ఇంటర్, డిగ్రీ వరకే చదివి ఆపేస్తున్నారు. – అర్చన, అసిస్టెంట్ ప్రొఫెసర్,
జీడీసీ, నిర్మల్
చదువులేక చిన్నచూపు..
మనప్రాంతంలో ఉన్నతవిద్య లేక దూరప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. నేను డాక్టర్ చదివేటప్పుడూ మనప్రాంతంపై వివక్ష, చిన్నచూపును గమనించా. అందుకే మనకూ యూనివర్సిటీ కావాల్సిందే.
–డా.కృష్ణంరాజు, సామాజికవేత్త
రాంజీ, భీమ్ స్ఫూర్తితో..
రాంజీగోండ్, కుమురంభీమ్ స్ఫూర్తితో యూనివర్సిటీ సాధన కోసం పోరాడుదాం. ఇందులో అన్నివర్గాలు కలిసి రావాలి. – ప్రవీణ్, టీజీవీపీ
ఉమ్మడిజిల్లా ప్రధానకార్యదర్శి
తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఉన్నత విద్యాభివృద్ధికి స్థానిక విద్యావంతులు, అధ్యాపకులు, విద్యార్థి సంఘాల నాయకులు ఒక్కటై నినదిస్తున్నారు. ‘సాక్షి మీడియా’ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవన్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశం జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు అవసరాన్ని నొక్కి చెప్పింది. ‘అక్షరం సాక్షిగా అందరం ఒక్కటిగా’ అనే నినాదంతో, నిర్మల్‌లో ‘జ్ఞాన సరస్వతీ యూనివర్సిటీ’ స్థాపన కోసం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ‘సాధించుకుందాం.. విశ్వవిద్యాలయం..’ అంటూ విద్యావంతులు, విద్యార్థి సంఘాల నేతలు ముక్తకంఠంతో నినదించారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు ఇప్పటికీ కాకతీయ యూనివర్సిటీ దూరభారంతో ఎదురవుతున్న సమస్యలను, మన ప్రాంతం కోల్పోతున్న విద్యాఫలాలను కళ్లకు కట్టించేలా వివరించారు. జిల్లాలో విశ్వవిద్యాలయం ఆవశ్యకతను అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వర్సిటీని సాధించుకుంటామని ప్రశ్నించారు. ముందుతరాలు బాగుపడాలన్నా, మన ప్రాంతం ముందడుగు వేయాలన్నా ఇక్కడ యూనివర్సిటీ తప్పనిసరి అని స్పష్టంచేశారు. గతంలో కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేసినట్లే.. ఇప్పటికే నిర్మల్‌లో ఉన్న కాకతీయ పీజీసెంటర్ కేంద్రంగా ‘జ్ఞాన సరస్వతీ యూనివర్సిటీ‘ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో ఇందుకు సంబంధించిన కమిటీని ప్రకటిస్తామన్నారు. నిర్మల్ ప్రాంత విద్యాభివృద్ధి విషయంలో ‘సాక్షి‘ తీసుకుంటున్న ప్రత్యేక చొరవను వారంతా ప్రశంసించారు.
– నిర్మల్/నిర్మల్‌చైన్‌గేట్/నిర్మల్‌టౌన్
పూర్వవిద్యార్థిగా బాధపడుతున్న..
పీజీసెంటర్‌లో ఉన్న సోషియాలజీ రెగ్యులర్ కోర్సును తరలించడంపై పూర్వవిద్యార్థిగా బాధపడుతున్నా. వర్సిటీ సాధన కోసం విద్యార్థినేతగా అందరితో కలిసి పోరాడుతా.
– వెంకటేశ్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు
న్యాయపరంగా మనజిల్లాకే..
నిర్మల్‌లో యూనివర్సిటీ ఏర్పాటుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే ముందడుగు పడింది. ప్రభుత్వాల మార్పు, బడ్జెట్‌లో నిధులలోటుతో వెనుకబడింది. పీజీసెంటర్ ఉన్న నిర్మల్‌లోనే జ్ఞానసరస్వతీ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి.
–నంగె శ్రీనివాస్, జ్ఞానసరస్వతీ యూనివర్సిటీ సాధన సమితి వ్యవస్థాపకుడు
దూరభారంతో చదవలేకపోయా..
చదువులమ్మ కొలువైనా ఉమ్మడి జిల్లాలో యూనివర్సిటీ లేకపోవడం దారుణం. 1990లోనే ఖమ్మంలో పీజీ సీటు వచ్చినా దూరభారంతో వెళ్లలేకపోయాను.
– జుట్టు చంద్రశేఖర్, న్యాయవాది
ఎన్నో వనరులున్నా..
మన జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుకు ఎన్నో వనరులు, సౌకర్యాలు, ఆవశ్యకత ఉన్నా.. పట్టింపులేకపోవడం శోచనీయం. ఇప్పటికై నా విశ్వవిద్యాలయం కోసం ఉద్యమిద్దాం. – భూమన్నయాదవ్,
ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు
విద్యతోనే అభివృద్ధి..
ఉన్నతవిద్యతోనే మనప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుంది. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు ఏకమై వర్సిటీని సాధించుకుందాం.
– వెల్మల ప్రభాకర్,
టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు
ఉద్యమాల గడ్డ నిర్మల్..
వరంగల్, కరీంనగర్ తర్వాత నిర్మల్‌కు ఉద్యమాల గడ్డగా పేరు ఉంది. వర్సిటీ సాధనకు ప్రజా ప్రతినిధులు పార్టీలకు అతీతంగా ముందుకు రావాలి. ‘సాక్షి’ తీసుకున్న చొరవ అభినందనీయం. –రవికాంత్, టీయూటీఎఫ్
జిల్లా అధ్యక్షుడు
వివక్షతోనే కోర్సులు దూరం..
విద్యాభివృద్ధి చేయాల్సింది పోయి, వివక్షతో పీజీసెంటర్‌లో ఉన్న కోర్సులు ఎత్తివేయడం దౌర్భాగ్యం. ప్రతీ పార్టీ మేనిఫెస్టోలో వర్సిటీ ఎజెండాగా ఉండాలి.
– సురేందర్, గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్
ఉద్యమాలతోనే సాధ్యం..
తెలంగాణ తరహాలో ఉద్యమాన్ని చేస్తేనే వర్సిటీ ఏర్పాటు సాధ్యమవుతుంది. ఇందులో అన్నివర్గాలు భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది.
– విజయ్‌కుమార్, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి
ఉన్నతవిద్యలో వెనుకంజ..
జిల్లాలో పదోతరగతి వరకు 99 శాతం, ఇంటర్ 75 శాతం, డిగ్రీ 60 శాతం చదువుతుంటే.. పీజీకి వచ్చేసరికి 25 శాతం కూడా ఉండటం లేదు. అందుకే జిల్లాకు వర్సిటీ అవసరం.
– రాకేశ్, కామర్స్ లెక్చరర్
సమష్టి పోరాడుదాం..
విద్యాపరంగా అభివృద్ధి చెందాలంటే జిల్లాకు విశ్వవిద్యాలయం తప్పనిసరి. అన్నివర్గాలు, రంగాలు సమష్టిగా ఉద్యమించి వర్సిటీని సాధించుకుందాం. – దర్శనం దేవేందర్, పీడీ
జ్ఞానసరస్వతీ కొలువైన జిల్లా..
మనది జ్ఞానసరస్వతీ కొలువైన జిల్లా. ఇలాంటి చోట వర్సిటీ లేకపోవడం శోచనీయం. యూనివర్సిటీ సాధనను చాలెంజింగ్‌గా తీసుకుని సమష్టిగా సాధిద్దాం. – జవాద్ హుస్సేన్,
టీఎంఈఏ జిల్లా అధ్యక్షుడు
నిరుద్యోగం తగ్గుతుంది..
విశ్వవిద్యాలయం ఏర్పాటైతే ఉన్నతవిద్య అందుబాటులోకి రావడంతోపాటు నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. మన ప్రాంత పరిశోధనలు వెలుగులోకి వస్తాయి.
– డాక్టర్ వెల్మల రంజిత్,
తెలుగు అధ్యాపకుడు, జీడీసీ
ఇప్పటికే ఆలస్యమైంది..
జిల్లాలో వర్సిటీ ఏర్పాటు కోసం పోరాటం చేయడంలో ఇప్పటికే ఆలస్యమైంది. ఇక అందరినీ కలుపుకొని పోరాడుదాం. యూనివర్సిటీ సాధించుకుందాం.
– నూతన్‌కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి
పాలకులు కదిలేలా..
చదువులతల్లి కొలువైన జిల్లాలో ఇప్పటికీ ఉన్నతవిద్య అందకపోవడం దారుణం. ఇప్పటికై నా పాలకులు, అధికారులు వర్సిటీ కోసం కదిలేలా ఉద్యమిద్దాం. – వెంకటేశ్, ఏబీవీపీ
పంపించాల్సిన నంబరు 97054 44372
యూనివర్సిటీ.. సాధిద్దాం!
యూనివర్సిటీ.. సాధిద్దాం!
యూనివర్సిటీ.. సాధిద్దాం!
యూనివర్సిటీ.. సాధిద్దాం!
యూనివర్సిటీ.. సాధిద్దాం!
యూనివర్సిటీ.. సాధిద్దాం!
యూనివర్సిటీ.. సాధిద్దాం!
యూనివర్సిటీ.. సాధిద్దాం!
యూనివర్సిటీ.. సాధిద్దాం!
యూనివర్సిటీ.. సాధిద్దాం!
యూనివర్సిటీ.. సాధిద్దాం!
యూనివర్సిటీ.. సాధిద్దాం!
యూనివర్సిటీ.. సాధిద్దాం!
యూనివర్సిటీ.. సాధిద్దాం!
యూనివర్సిటీ.. సాధిద్దాం!
యూనివర్సిటీ.. సాధిద్దాం!
యూనివర్సిటీ.. సాధిద్దాం!
యూనివర్సిటీ.. సాధిద్దాం!
యూనివర్సిటీ.. సాధిద్దాం!