
నిర్మల్
పర్యాటకం.. అభివృద్ధికి దూరం
సహజ అందాలకు నిలయమైన కడెం ప్రాజెక్టు, ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. పర్యాటకుల సంఖ్యకు తగ్గ సౌకర్యాలు మాత్రం లేవు.
బుధవారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2025
10లోu
కాకతీయ.. ఇదేం కథ..!?
ఇది.. కాకతీయ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్. ఇందులో.. నిర్మల్‌లో కాకతీయ విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల(పీజీ సెంటర్) అక్టోబర్ 1991లో స్థాపించబడిందని, ఈ కళాశాల సోషియాలజీలో ఎం.ఫిల్‌తో పాటు ఇంగ్లిష్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంకామ్, పీజీ డీసీఏ సబ్జెక్టులలో పీజీ కోర్సులను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆదివాసీ మ్యూజియంను బలోపేతం చేయడానికి ఐటీడీఏ, డీఆర్‌డీఏ, జిల్లా సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నట్లు తెలిపారు. కళాశాలలో తరగతి గదులు, రెండు సెమినార్ హాళ్లు, లైబ్రరీ, ఒక కంప్యూటర్ ప్రయోగశాల ఉన్న విశాలమైన భవనంగా పేర్కొన్నారు. ప్రత్యేక భవనంలో విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. కానీ.. ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు కేవలం భవనం తప్పా.. పైవేవీ నిర్మల్ పీజీ సెంటర్‌లో లేవు. కాకతీయ అధికారిక వెబ్‌సైట్‌లో పాతముచ్చట్లనే కొనసాగిస్తూ.. అందరినీ మభ్యపెడుతోంది.
నిర్మల్ కాలేజీ.. ఆసిఫాబాద్‌కు..
ఇది.. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీకళాశాలపై అంతస్తులో మహి ళా డిగ్రీ కళాశాల కోసం కేటాయించిన తరగతి గది. ఇప్పుడు ఈ క్లాసులు ఖాళీగానే ఉంటున్నాయి. ఎందుకంటే.. ఇక్కడ ఉన్న మహిళా డిగ్రీ కళాశాలను ఆసిఫాబాద్ తరలించేశారు. జిల్లాకేంద్రంలో కాకుంటే.. డిగ్రీ కాలేజీ డిమాండ్ ఉన్న ఖానాపూర్‌లోనైనా ఈ కాలేజీని పెట్టాల్సింది. అలా చేయకుండా.. ఎక్కడో ఉన్న ఆసిఫాబాద్‌కు తరలించేశారు. ఇప్పటికీ అక్కడ నిర్మల్ కాలేజీ పేరిటనే కొనసాగుతోంది. ఉన్నతవిద్యను అందించే ఓ కాలేజీ తరలిపోయినా స్థానిక పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరం.
న్యూస్‌రీల్

నిర్మల్

నిర్మల్