
విద్యుత్ లేని గ్రామాల సర్వే
పెంబి: మండలంలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలను అటవీ, విద్యుత్‌శాఖ అధికారులు మంగళవారం సర్వే చేశారు. సింగిల్ విద్యుత్ సౌకర్యం లేని చాకిరేవు, సోముగూడ, త్రీఫేజ్ సౌకర్యం లేని కోసగుట్ట, కొత్తగూడ, గుమ్మెన ఎంగ్లాపూర్, ఒడ్డెగుడెం, గోధుమ గ్రామాలను సర్వే చేసినట్లు డీఎఫ్‌వో నాగిని భాను తెలిపారు. నివేదికలు తయారు చేసి సంబంధిత అధికారులను పంపుతామన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌డీవో శివకుమార్, పెంబి ఎఫ్‌ఆర్‌వో రమేశ్‌రావు, విద్యుత్ శాఖ ఏడీఈ శ్రీనివాస్, ఏఈ శ్రీనివాస్, లైన్ ఇన్‌స్పెక్టర్ రమేశ్, ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.