ఆర్టీసీ బస్టాండ్‌లో రాఖీ కౌంటర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్టాండ్‌లో రాఖీ కౌంటర్‌

Aug 6 2025 7:08 AM | Updated on Aug 6 2025 7:08 AM

ఆర్టీసీ బస్టాండ్‌లో రాఖీ కౌంటర్‌

ఆర్టీసీ బస్టాండ్‌లో రాఖీ కౌంటర్‌

నిర్మల్‌టౌన్‌: నిర్మల్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో రాఖీ కౌంటర్‌ను డిపో మేనేజర్‌ పండరి మంగళవారం ప్రారంభించారు. దూర ప్రాంతాలలో ఉన్న సోదరులకు రాఖీ కట్టడానికి వెళ్లలేని సోదరీమణుల కోసం ఈ కౌంటర్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటర్‌ వద్ద వచ్చి బుక్‌ చేసుకుంటే.. రాఖీలు వేగంగా, భద్రంగా కార్గోలో చేరవేస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్గో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ కిశోర్‌, స్టేషన్‌ మేనేజర్‌ ఏఆర్‌.రెడ్డి, కంట్రోలర్లు పీఆర్‌.గోపాల్‌, గజపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement