
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
భైంసారూరల్: మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి రాధిక అన్నారు. మండలంలోని దేగాం గ్రామంలో విద్యార్థులతో మాదకద్రవ్యాల నిర్మూలనపై సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించా రు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నా రు. ఉజ్వల భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దవని సూచించారు. మత్తు పదార్థాలతో ఆరోగ్యంపైపడే దుష్ప్రభావాలను వివరించా రు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యంతో చదువుకుని మంచి గుర్తింపు పొందాలన్నారు. మత్తుకు బానిసలై గతేడాది 12 మంది ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. సీఐ నైలు, ఎస్సై శంకర్, హెచ్‌ఎం అజీమ్, ఎంఈవో సుభాష్ తదితరులు పాల్గొన్నారు.