
గాయపడ్డ గల్ఫ్ కార్మికుడిని స్వదేశానికి రప్పించాలి
ఖానాపూర్: మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన రెంకల రాజేందర్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. జూన్ 24న అక్కడ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తన భర్తను స్వగ్రామానికి రప్పించాలని రాజేందర్ భార్య మల్లీశ్వరి గ్రామస్తులు, కుటుంబీకులతో బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జాన్సన్‌నాయక్‌కు సోమవారం విన్నవించారు. ప్రమాదంలో కాలు విరిగి మంచానికే పరిమితమయ్యాడని తెలిపారు. స్పందించిన జాన్సన్ నాయక్ ఎంబ సీ అధికారులతో మాట్లాడి స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.