వాళ్లకు గ్యారంటీ లేదా? | - | Sakshi
Sakshi News home page

వాళ్లకు గ్యారంటీ లేదా?

Aug 5 2025 6:15 AM | Updated on Aug 5 2025 6:15 AM

వాళ్ల

వాళ్లకు గ్యారంటీ లేదా?

నిర్మల్‌
ఆర్జీయూకేటీలో యక్షగానం
బాసరలోని ఆర్జీయూకేటీ క్యాంపస్‌లో సోమవారం స్పీక్‌ మాకే హెరిటేజ్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో యక్షగాన కళా ప్రదర్శన నిర్వహించారు. సీతాపహరణ ఘట్టం ఆకట్టుకుంది.

మంగళవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2025

8లోu

జిల్లాస్థాయి యోగా పోటీలు ప్రారంభం

భైంసాటౌన్‌: పట్టణంలోని గౌతమి హైస్కూల్‌లో జిల్లా యోగా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాస్థాయి యోగా పోటీలు ప్రారంభించారు. ఎమ్మెల్యే పి.రామారావు పటేల్‌ హాజరై పోటీలు ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచానికి యోగాను పరిచయం చే సింది భారతదేశమే అన్నారు. యోగాతో శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. జిల్లాలో ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో యోగా అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు అన్నపూర్ణ, ప్రధాన కార్యదర్శి మల్లేశ్‌, నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌, జాయింట్‌ సెక్రెటరీ ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్‌చైన్‌గేట్‌: ఆరు గ్యారంటీలలో భాగంగా రాష్ట్రంలో అమలవుతున్న 200 యూనిట్ల ఉచిత వి ద్యుత్‌, రూ.500లకే వంట గ్యాస్‌ సిలిండర్‌ సబ్సిడీ పథకాలు కొత్తగా రేషన్‌ కార్డులు పొందిన వారికి అందడం లేదు. ప్రభుత్వం పథకాలకు తెల్లరేషన్‌కార్డు తప్పనిసరి చేసింది. దీంతో పదేళ్లుగా కార్డులు జారీ కాక, అర్హత ఉన్న పేదలు పథకాలు పొందలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తోంది. అయితే సబ్సిడీ పథకాలకు మాత్రం దరఖాస్తులు స్వీకరించడం లేదు.

కొత్తగా 29,387 కుటుంబాల అర్హత..

కొత్త రేషన్‌ కార్డుల కోసం జిల్లాలో 33,982 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 29,387 కుటుంబాలకు కొత్త కార్డులు మంజూరయ్యాయి. దీంతో ఈ కుటుంబాలు ఆరు గ్యారంటీల పథకాలకు అర్హత సాధించాయి. ఉచిత విద్యుత్‌, సబ్సిడీ వంట గ్యాస్‌ కోసం దరఖాస్తు చేసుకునే అర్హత పొందాయి. ఏడాదిన్నర క్రితం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో వీరు దరఖాస్తు చేసుకున్నా రేషన్‌కార్డు లేదన్న కారణంగా తిరస్కరణకు గురయ్యాయి. ఇప్పుడు రేషన్‌కార్డులు ఉన్నా.. దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం లేదు.

ప్రజాపాలన సేవా కేంద్రాలకు పరుగు..

ఎంపీడీవో, మున్సిపల్‌ కార్యాలయాల్లో ప్రభుత్వం ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేసింది. కొత్తగా రేషన్‌కార్డులు జారీ అయినవారు సబ్సిడీ విద్యుత్‌, గ్యాస్‌ సిలిండర్‌ కోసం ఈ కేంద్రాలకు వెళ్తున్నారు. దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు.

న్యూస్‌రీల్‌

ఉచిత విద్యుత్‌..

జిల్లాలో 29,387 కొత్తగా రేషన్‌ కార్డులు జారీ

దీంతో ప్రభుత్వ పథకాలకు అర్హత..

కానీ, ఉచిత విద్యుత్‌, గ్యాస్‌ సబ్సిడీ అందని వైనం..

దరఖాస్తుల కోసం అర్హుల ఎదురుచూపు

జిల్లాలోని మొత్తం రేషన్‌ కార్డులు 2,33,471

లబ్ధిదారులు 7,33,913

నెలకు పంపిణీ చేసే రేషన్‌ బియ్యం దాదాపు 4,253 మెట్రిక్‌ టన్నులు

నూతన రేషన్‌ కార్డుల వివరాలు..

వచ్చిన దరఖాస్తులు 33,982

మంజూరైన కొత్త రేషన్‌ కార్డులు 29,386

లబ్ధిదారులు 89,308

మెంబర్‌ యాడింగ్‌ వివరాలు..

మొత్తం వచ్చిన దరఖాస్తులు 48,063

ఆమోదించిన దరఖాస్తులు 44,388

లబ్ధిదారులు 63,595

జిల్లాలో 2,03,269 గృహ విద్యుత్‌ కనెక్షన్లలో జూలై నెలలో 1,27,601 కనెక్షన్లు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు అర్హత సాధించాయి. ఈ పథకం తెల్ల రేషన్‌ కార్డు దారులకు గణనీయమైన ఆర్థిక ఊరటను కల్పిస్తోంది. జిల్లాలో 2,51,785 వంట గ్యాస్‌ కనెక్షన్లలో కేవలం 1,15,532 కనెక్షన్లకు మాత్రమే రూ.500 సబ్సిడీ వర్తిస్తోంది. ప్రస్తుతం 29,387 కొత్త రేషన్‌కార్డులు జారీ అయిన నేపథ్యంలో తమకూ అవకాశం ఇవ్వాలని అర్హులు కోరుతున్నారు.

జిల్లావ్యాప్తంగా మొత్తం

కేటగిరీ 1 సర్వీసులు 2,03,269

జూలైలో అర్హత పొందిన సర్వీసులు1,27,601

గృహజ్యోతి బిల్లు పంపిణీ చేసిన సర్వీసులు1,21,646

జూలైలో గృహజ్యోతి సొమ్ము

రూ.476.30 లక్షలు

వాళ్లకు గ్యారంటీ లేదా? 1
1/1

వాళ్లకు గ్యారంటీ లేదా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement