
పురుగుమందులు విక్రయించొద్దు
నకిలీ, కాలం చెల్లిన
సారంగపూర్: ఎరువులు, పురుగుమందుల దుకాణ యజమానులు రైతులకు కాలం చెల్లిన, నకిలీ ఎరువులు, పురుగుమందులు విక్రయిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. మండలంలోని చించోలి(బి) ఎక్స్‌రోడ్డు వద్దగల డీసీఎంఎస్ ఎరువుల దుకాణాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం సారంగాపూర్‌లోని ఆగ్రోస్ రైతు సేవాకేంద్రం తనిఖీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎరువులు, పరుగు మందుల దుకాణ యజమానులు నిత్యం స్టాక్‌బోర్డు నిర్వహించాలని సూచించారు. అందుబాటులో ఉన్న, యూరియా , ఇతర ఎరువుల వివరాలు బోర్గుపై ప్రదర్శించాలని తెలిపారు. ఎరువుల అమ్మకానికి సంబంధించిన రశీదులను తనిఖీ చేశారు. అన్ని రశీదులు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. రైతులతో మాట్లాడి వారికి అవసరమైన ఎరువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధిక మోతాదులో యూరియా వినియోగంతో భూసారం తగ్గిపోయి దిగుబడి తగ్గుతుందని తెలిపారు. తనిఖీల్లో జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మీకాంత్‌రావు, ఎంపీవో అజీజ్‌ఖాన్, మండల వ్యవసాయాధికారి వికార్ అహ్మద్, ఏఈవోలు, రైతులు ఉన్నారు.
కలెక్టర్ అభిలాష అభినవ్
ఫర్టిలైజర్, ఎరువుల దుకాణాల ఆకస్మిక తనిఖీ