
హక్కుల కోసం పోరాడాలి
నిర్మల్‌టౌన్: దేశ పౌరులు హక్కుల కోసం రాజ్యాంగబద్ధంగా పోరాడాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ రాజేశ్‌కన్నా అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవనంలో మానవ హక్కుల కమిషన్‌పై మంగళవారం అవగాహన సద స్సు నిర్వహించారు. రాజేశ్‌కన్నా మాట్లాడు తూ.. దేశ పౌరులకు ఉన్న హక్కులను వివరించారు. ప్రతీ పౌరునికి సాధారణంగా కొన్ని సెక్షన్లపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం జాతీయ మానవ హక్కుల కమిషన్ లోగో ఆవిష్కరించారు. జాతీయ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సాహిల్‌ఖాన్, మేనేజింగ్ డైరెక్టర్ నాగేశ్వరి, నూర్జహాన్, షాబొద్దీన్, సోఫీ ఇమ్రాన్, షరీఫ్‌బిన్ హాది, ఇసాక్ అలీ, ఇంతియాజ్ పాల్గొన్నారు.