
జాగ్రత్తలే రక్ష
కడెం: ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు సంభవించినపుడు చిన్నపాటి జాగ్రత్తలతో ప్రాణాలు రక్షించుకోవచ్చని ఎన్‌డీఆర్‌ఎఫ్ కమాండర్ వినీత్‌కుమార్ అన్నారు. కడెం ప్రాజెక్టు దిగువ ప్రాంతాలైన కడెం, కొండుకూర్, కన్నాపూర్ గ్రామాల్లో ప్రకృతి విపత్తులు, రక్షణ చర్యలపై శుక్రవారం అవగాహన కల్పించారు. వరదలు, రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇందులో తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో అరుణ, ఎంపీవో కవిరాజు, ఆర్‌ఐ శారద, సీనియర్ ఆసిస్టెంట్ పొశెట్టి, పంచాయతీ కార్యదర్శులు భూమేశ్, అరుణ, మునిరుల్‌హసన్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.