
విలువలతో కూడిన విద్యను అందించాలి
● డీఈవో రామారావు
కుంటాల: విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించాలని డీఈవో రామారావు సూ చించారు. మండలంలోని కల్లూరు ఉన్నత పా ఠశాలలో కొనసాగుతున్న కాంప్లెక్స్ సమావేశానికి శుక్రవారం హాజరై మాట్లాడారు. బోధన ప్రక్రియలో భాగంగా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌పై మానిటరింగ్ చేశారు. అనంతరం ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించారు. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలను బోధించి వారి సందేహాలు నివృత్తి చేశా రు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ముత్యం, ఏఎంవో నర్సయ్య, హెచ్‌ఎంలు రాజేశ్వర్, చంద్రశేఖర్‌రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థి స్థాయిని బట్టి బోధించాలి
లోకేశ్వరం: విద్యార్థుల స్థాయిని బట్టి పాఠాలు బోధించాలని డీఈవో రామారావు సూచించారు. మండలంలోని మన్మద్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సూల్క్ కాంప్లెక్స్ సమావేశానికి శుక్రవారం హాజరై మాట్లాడారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో పాఠ్యాంశాలను చదివించారు. పాఠశాలలో నిర్వహించే కిచెన్ గార్డెన్, మధ్యాహ్న భోజనం పరిశీలించారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ విద్యార్థులకు ఎఫ్‌ఆర్‌ఎస్, ఎఫ్‌ఎల్‌ఎన్ పద్ధతిలో విద్య బోధించాలన్నారు. పాఠశాలకు అందించిన లైబ్రరీ బుక్‌లను విద్యార్థులు వినియోగించుకునేలా చూడాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై మరింత శ్రద్ధ వహించాలన్నారు. కాంప్లెక్స్ సమావేశంలో పోక్సోపై చట్టం గురించి ఉపాధ్యాయులకు వివరించారు. ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళిక, టీచర్ డైరీ, టీఎల్‌ఎంలను తప్పనిసరిగా పాఠశాలలో నిర్వహించాలన్నారు. డీఈవో వెంట ఎంఈవో చంద్రకాంత్, జిల్లా కోర్డినేటర్ నర్సయ్య, కాంప్లెక్స్ ఉపాధ్యాయులు ఉన్నారు.